Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'క‌ల్కి' కలెక్ష‌న్ల ప్ర‌భంజ‌నం.. 4 రోజుల్లోనే రూ. 500 కోట్ల వ‌సూళ్లు!

Kalki 2898 AD Colletions Cross Rs 500 Cr in 4 Days
Advertisement
  • ప్ర‌భాస్‌, నాగ్ అశ్విన్ కాంబినేష‌లో 'క‌ల్కి 2898 ఏడీ'
  • జూన్ 27న విడుద‌లైన మూవీకి పాజిటివ్ టాక్‌
  • దీంతో వ‌సూళ్ల ప‌రంగా దూసుకెళ్తున్న 'క‌ల్కి'
Advertisement
ప్ర‌భాస్‌, నాగ్ అశ్విన్ కాంబినేష‌న్ లో జూన్ 27న వ‌చ్చిన క‌ల్కి 2898 ఏడీ చిత్రం క‌లెక్ష‌న్ల‌లో ప్ర‌భంజ‌నం సృష్టిస్తోంది. విడుద‌లైన నాలుగు రోజుల్లోనే ఈ సినిమా రూ. 500 కోట్ల‌కుపైగా వ‌సూళ్లు రాబ‌ట్టిన‌ట్లు నిర్మాణ సంస్థ‌ వైజ‌యంతి మూవీస్ ట్వీట్ చేసింది. 

శ‌నివారం వ‌ర‌కు ఈ చిత్రం రూ. 415 కోట్లు వ‌సూలు చేసిన సంగ‌తి తెలిసిందే. శ‌ని, ఆదివారం వీకెండ్స్ కావ‌డంతో భారీ వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఈ చిత్రంలో బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్‌, విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్‌, బాలీవుడ్ న‌టి దీపిక ప‌దుకొణె వంటి స్టార్లు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. 

ఇక మూవీకి పాజిటివ్ టాక్ రావ‌డంతో వ‌సూళ్ల పరంగా దూసుకెళ్తోంది. ద‌గ్గ‌ర‌లో పెద్ద చిత్రాలేవి కూడా విడుద‌ల‌కు సిద్ధంగా లేక‌పోవ‌డంతో క‌ల్కి క‌లెక్ష‌న్లు స్ట‌డీగానే ఉండే అవ‌కాశం ఉంద‌ని సినీ విశ్లేష‌కులు అభిప్రాయం ప‌డుతున్నారు. సైన్స్‌ఫిక్ష‌న్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా అభిమానుల‌ను ఉర్రుత‌లూగిస్తోంది.   

ఇప్ప‌టికే వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు మూవీని చూసి ప్ర‌శంస‌లు కురిపించారు. భార‌త సినిమా స్థాయిని పెంచే చిత్రాన్ని ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ అందించాడంటూ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు.
Advertisement
Advertisement
Kalki 2898 AD
Prabhas
Nag Ashwin
Tollywood

More Telugu News